నిర్మాతలూ నన్ను మన్నించండి
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి – ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ప్రస్తుతం కీలకమైన పదవిలో ఉన్నానని, తన ముందు ఎన్నో సమస్యలు పేరుకు పోయి ఉన్నాయని వాటిని తీర్చేందుకు చాలా కష్ట పడాల్సి ఉంటుందన్నారు.
ఎమ్మెల్యేగా గెలవక ముందు నుంచీ తాను నటుడిగా పలు సినిమాలు చేసేందుకు ఒప్పుకున్నానని, దీని వల్ల కొందరు నిర్మాతలకు ఇబ్బంది కలిగించిన మాట వాస్తవామేనని పేర్కొన్నారు. నాకు ప్రస్తుతం సినిమాలు చేసే టైమ్ ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు పవన్ కళ్యాణ్.
ప్రస్తుతం బిజీగా ఉన్నానని, మూడు నెలల తర్వాత వీలు కుదిరితే రెండు లేదా మూడు రోజుల పాటు సినిమాలు చేస్తానని చెప్పారు. దీంతో 90 రోజుల పాటు షూటింగ్ లకు తాను దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్.
ఈ మేరకు తాను తీసుకున్న ఈ నిర్ణయం నిర్మాతలకు ఇబ్బంది కలిగిస్తుందని తనకు తెలుసన్నారు. తన పరిస్థితిని గమనించి సహృదయంతో అర్థం చేసుకుని, తనను మన్నించాలని కోరారు.