గౌతం సవాంగ్ రాజీనామా
ఏపీపీసీసీ చైర్మన్ కు గుడ్ బై
అమరావతి – ఏపీ మాజీ డీజీపీ గౌతం సవాంగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కీలకమైన పదవిని అలంకరించారు. అదే సమయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రధానంగా టీడీపీ ఆయనపై పలు ఆరోపణలు చేసింది.
తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ఎన్డీఏ కూటమి సర్కార్ కొలువు తీరింది. ఇదే సమయంలో ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు కొలువు తీరారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రక్షాళన ప్రారంభించారు. జగన్ రెడ్డికి వంత పాడుతూ వచ్చిన ఐఏఎస్ లు, ఐపీఎస్ లను లిస్టు తయారు చేశారు.
ఇందులో భాగంగానే టీటీడీ ఈవోగా ఉన్న ధర్మా రెడ్డిపై వేటు వేశారు. ఇదే సమయంలో సీఎస్ గా ఉన్న జవహర్ రెడ్డిని తన వద్దకు కూడా రానీయ లేదు చంద్రబాబు నాయుడు. తాజాగా తమను ఇబ్బంది పెట్టిన గౌతం సవాంగ్ ను రాజీనామా చేయాల్సిందిగా సూచించారు.
ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ఉన్నారు. ఆయన రాజీనామా చేసిన వెంటనే ఆమోదం తెలిపింది సర్కార్.