ఢిల్లీలో ఏపీ సీఎం బిజీ
ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ
న్యూఢిల్లీ – ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం టీడీపీ ఎన్డీయే సర్కార్ లో కీలకమైన పాత్ర పోషిస్తోంది.
ఇదిలా ఉండగా గురువారం ఉదయం 9 గంటలకు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‍తో సమావేశం అయ్యారు నారా చంద్రబాబు నాయుడు. 10.15 గంటలకు ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు. మధ్యాహ్నం 12.15 గంటలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో , 2 గంటలకు వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో , 2.45 గంటలకు హోం మంత్రి అమిత్‌షాతో సీఎం చంద్రబాబు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా శుక్రవారం ఉదయం 9 గంటలకు నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం,10 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామాన్, 10.45 గంటలకి కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, మధ్యాహ్నం 12.30 గంటలకు కేంద్ర మంత్రి అథవాలేతో భేటీ కానున్నారు , తర్వాత పలువురు పారిశ్రామికవేత్తలు, జపాన్ రాయబారితో సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.