టీమిండియాకు మోడీ అభినందన
ప్రధానమంత్రిని కలిసిన క్రికెటర్లు
న్యూఢిల్లీ – ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2024 ను గెలుచుకున్న రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు స్వదేశానికి చేరుకుంది. ఈ సందర్బంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ ) బాస్ రోజర్ బిన్నీ, కార్యదర్శి జే షాతో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే , జస్ప్రీత్ బుబ్రా, యుజ్వేంద్ర చాహల్ తో పాటు ఇతర క్రికెటర్లు ప్రధానమంత్రి నివాసంలో గురువారం కలుసుకున్నారు.
భారత జట్టు బ్రిస్బేన్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో బలమైన దక్షిణాఫ్రికా జట్టును ఓడించింది. చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన ఈ మ్యాచ్ ఆద్యంతం ఆసక్తిని రేపింది టి20 వరల్డ్ కప్.
ఈ సందర్బంగా భారత దేశానికి చెందిన వ్యాపార, వాణిజ్య, క్రీడా, సినీ రంగానికి చెందిన ప్రముఖులు అభినందనలతో ముంచెత్తారు. ఇదిలా ఉండగా దేశ చరిత్రలోనే తొలిసారిగా భారీ ఎత్తున నజరానా ప్రకటించింది బీసీసీఐ. ఏకంగా టీమిండియాకు రూ. 125 కోట్లు ఇస్తున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతి ఒక్కరినీ అభినందనలతో ముంచెత్తారు.