NEWSANDHRA PRADESH

జ‌గ‌న్ రెడ్డీ జ‌ర భ‌ద్రం

Share it with your family & friends

సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి

అమ‌రావ‌తి – మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. అస‌లు రాష్ట్రంలో అడ్ర‌స్ లేకుండా పోయిన వైసీపీ ఇంకా ఉంద‌ని అనుకోవ‌డం భ్ర‌మ త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ముందు పార్టీని కాపాడుకుంటే బెట‌ర్ అని హిత‌వు ప‌లికారు.

రాష్ట్రాన్ని స‌ర్వ నాశ‌నం చేసింది చాల‌క త‌మ‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేయ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. ఈవీఎంలు ప‌గ‌ల‌గొట్టి, సీఐపై హ‌త్యా య‌త్నం చేస్తే త‌ప్పు లేదా అని ప్ర‌శ్నించారు. పాపాలు చేశారు కాబ‌ట్టే ఇవాళ ఫ‌లితం అనుభ‌విస్తున్నార‌ని అన్నారు. పైన దేవుడు ఉన్నాడ‌ని, ఆయ‌నను అపవిత్రం చేయ బోయార‌ని, చివ‌ర‌కు అభాసుపాలు కావాల్సి వ‌చ్చింద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

నెల్లూరులో మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై భ‌గ్గుమ‌న్నారు సోమిరెడ్డి చంద్ర మోహ‌న్ రెడ్డి. .డ్రైవర్ సుబ్రహ్మణ్యం డెడ్ బాడీని కూడా డోర్ డెలివరీ చేశారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. రామోజీరావు, అమర్ రాజా ఫ్యాక్టరీ, సంగం డెయిరీ, రఘురామ కృష్ణంరాజు, అచ్చెన్నాయుడు చివరకు చంద్రబాబు నాయుడిని కూడా వదిలిపెట్టకుండా కక్ష సాధింపుల్లో అందరినీ సమానంగా చూశావు క‌దా ఇప్పుడు అనుభ‌వించు అంటూ మండిప‌డ్డారు.

ఈవీఎం పగల కొడితే తప్పేమిటని ఒక సీఎంగా పని చేసిన వ్యక్తి అనడం చాలా దురదృష్టకరం అన్నారు.
ప్రజాస్వామ్యం. చట్టం, ఎన్నికల కమిషన్ పై జగన్మోహన్ రెడ్డికి కనీస గౌరవం లేదని ధ్వ‌జ‌మెత్తారు.