త్వరలోనే మంత్రివర్గ విస్తరణ
ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ – టీపీసీసీ చీఫ్ , తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఊహాగానాలకు తెర దించే ప్రయత్నం చేశారు. ఆశావహుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించేలా త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
ఇక తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఎవరిని నియమిస్తారనేది తన చేతుల్లో లేదన్నారు. అది పార్టీ హై కమాండ్ చూసుకుంటుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన ఢిల్లీలో పార్టీ చీఫ్ , ఇతర ముఖ్య నేతలతో చర్చలు జరిపారు. ఇదే సమయంలో కీలకమైన టీపీసీసీ చీఫ్ నుంచి తను తప్పుకోనున్నారు.
పార్టీ నియమం ప్రకారం ఒక వ్యక్తి ఏక కాలంలో రెండు పదవులు ఉండ కూడదని. ఇదే సమయంలో పాలనా పరంగా చాలా ఇబ్బందులు ఏర్పడుతుండడంతో ఎక్కువ సమయాన్ని కేటాయించ లేక పోతుండడం కూడా ఓ కారణంగా ఉంది. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బాల్ ఏఐసీసీ కోర్టులో ఉందన్నారు. ఎందుకు ఆలస్యం అవుతుందనేది హై కమాండ్ చెప్పాలన్నారు.