పెండింగ్ సమస్యలను పరిష్కరించండి
ప్రధాన మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
న్యూఢిల్లీ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ లో బిజి బిజీగా ఉన్నారు. గురువారం సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కేంద్ర మంత్రులను కలుసుకున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి సంబంధించి పలు సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలుసుకున్నారు. ఈ సందర్బంగా ప్రత్యేకంగా అంశాలను ప్రస్తావించారు. ఇప్పటి దాకా తమ ప్రభుత్వ పరంగా పలు మార్లు వినతి పత్రాలు సమర్పించడం జరిగిందని తెలిపారు పీఎంకు.
రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలను ప్రస్తావించారు ఎనుముల రేవంత్ రెడ్డి. తక్షణమే యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.