NEWSANDHRA PRADESH

ప‌వ‌ర్ స్టార్ కు రుణ‌ప‌డి ఉన్నా

Share it with your family & friends

ఎమ్మెల్సీ అభ్య‌ర్థి హ‌రి ప్ర‌సాద్

అమరావ‌తి – ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు పి.హరిప్రసాద్ కృతజ్ఞతలు తెలియ చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జనసేన పార్టీకి హరిప్రసాద్ అందించిన సేవలు విలువైనవి… నిస్వార్థమైనవని కొనియాడారు. అంకిత భావంతో పార్టీ కోసం పని చేశారని ప్ర‌శంసించారు. మండలిలో ప్రజా సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి కోసం బలంగా చర్చించేందుకు అవగాహన హరిప్రసాద్ గారికి ఉందన్నారు.

ఆయన మాట్లాడేటప్పుడు భాషలో కంటే భావంలో వాడి వేడి చూపే నైపుణ్యం కచ్చితంగా ప్రజా ప్రయోజనకరమైన చర్చలకు అవకాశం ఇస్తుందన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

పవన్ కళ్యాణ్ తనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ, నమ్మకాన్ని నిలబెట్టు కొంటానని హరిప్రసాద్ తెలిపారు.