బాలినేనికి ఢోకా లేదు
ఎంపీ విజయ సాయి రెడ్డి
అమరావతి – వైసీపీ ఎంపీ , రాజ్యసభ పార్లమెంటరీ నాయకుడు విజయ సాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల జ్వరం మొదలైంది. ఇప్పటికే పార్టీ బాస్ , సీఎం జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థులను ఖరారు చేసింది. మొత్తం మూడు విడతలుగా జాబితాను విడుదల చేశారు. కొందరికి సీటు రాలేదు. ఇంకొందరు నేతలకు స్థానాలు మారాయి. దీంతో అసమ్మతి స్వరం మొదలైంది.
ఆరోపణల పర్వం కూడా ప్రారంభమైంది. దీనిపై తీవ్ర స్థాయిలో స్పందించారు ఎంపీ విజయ సాయి రెడ్డి. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అసమ్మతి అనేది తమ పార్టీలో లేదన్నారు. అలాంటి మాటకే తావు లేదని స్పష్టం చేశారు.
ఈ సందర్బంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విజయ సాయి రెడ్డి. ఆయనకు ఎలాంటి సమస్యా లేదన్నారు. కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని కొట్టి పారేశారు. వైసీపీకి ఆయన అత్యంత విలువైన నాయకుడని పేర్కొన్నారు.
పార్టీలో ఆయనకు ప్రాధాన్యత తగ్గలేదన్నారు. ఆయన స్థానం ఎక్కడికీ పోదన్నారు. ఉన్న చోటనే ఉంటుందన్నారు. రాజకీయ పార్టీలు అన్నాక పరస్పర ఆరోపణలు సర్వ సాధారణమని పేర్కొన్నారు ఎంపీ. ఏ రాజకీయ పార్టీకి పవర్ ఇవ్వాలనేది ప్రజలు నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.