DEVOTIONAL

కరపత్రాలు ఆవిష్కరించిన ఈవో

Share it with your family & friends

నంద‌లూరు, తాళ్ల‌పాక బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుపతి : ప్ర‌తి ఏటా ప్ర‌ముఖ ఫుణ్య క్షేత్రాలుగా విరాజిల్లుతూ వ‌స్తున్నాయి నందలూరు, తాళ్లపాక ఆలయాలు. ఈ ఆల‌యాల‌లో బ్ర‌హ్మోత్స‌వాల‌ను నిర్వ‌హిస్తోంది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి.

ఇందులో భాగంగా బ్ర‌హ్మోత్సవాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని ఈ సంద‌ర్బంగా ఆదేశించారు టీటీడీ కార్య నిర్వ‌హ‌ణ అధికారి జె. శ్యామ‌లారావు. దీనిని పుర‌స్క‌రించుకుని ఏర్పాటు చేసిన కరపత్రాలను టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు, జేఈవో వీరబ్రహ్మంతో కలిసి విడుదల చేశారు.

నందలూరు సౌమ్య నాథ స్వామి, తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల కరపత్రాలను విడుదల చేశారు. ఉత్స‌వాల సంద‌ర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేయ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు ఈవో. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల‌ని సూచించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ ప్రశాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.