అమెరికాలో ఎత్తైన ఆంజనేయ విగ్రహం
ప్రారంభించిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్
అమెరికా – శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి అమెరికాలో పర్యటిస్తున్నారు. భక్తులకు మంగళా శాసనాలు అందజేస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి దివ్య ఆశీస్సులతో అమెరికా (హ్యూస్టన్ సిటీ) లోని అష్టలక్ష్మి దేవాలయం ప్రాంగణంలో అత్యంత ఎత్తైన అభయ ఆంజనేయ పంచలోహ విగ్రహం రూపుదిద్దుకుంటున్నది.
స్టేట్ ఆఫ్ యూనియన్ పేరిట రూపుదిద్దుకుంటున్న అభయ ఆంజనేయ విగ్రహం అమెరికాలోనే అత్యంత ఎత్తైన విగ్రహాలలో 5వ విగ్రహం కావడం విశేషం. ఈ విగ్రహ నిర్మాణం కోసం భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని శంషా బాద్ ముచ్చింతల్ ఆశ్రమంలో శ్రీశ్రీశ్రీ రామానుజుడి ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉండగా అమెరికాలో రూపు దిద్దుకుంటున్న ఈ అభయ ఆంజనేయ పంచలోహ విగ్రహం ఎత్తు 72 అడుగులు ఉంది. గ్రౌండ్ లెవల్ నుంచి 86.9 అడుగులు ఉండడం విశేషం.
2023 ఆగస్టులో ఈ విగ్రహం పనులను శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి భూమి పూజ చేసి ప్రారంభించారు. మరో రెండు నెలలలో విగ్రహావిష్కరణ లక్ష్యంగా పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.