టీమిండియాకు మరాఠా సర్కార్ నజరానా
రూ. 11 కోట్లు బహుమతి ప్రకటించిన సీఎం
మహారాష్ట్ర – మరాఠా సర్కార్ సంచలన ప్రకటన చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే భారీ నజరానా ప్రకటించారు. అమెరికా, విండీస్ వేదికగా జరిగిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ ను స్వంతం చేసుకున్న రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టుకు భారీ బహుమతి ఇస్తున్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగా తమ ప్రభుత్వం భారత జట్టుకు రూ. 11 కోట్లు నజరానాగా ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే భారత దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీమిండియాకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఏకంగా రూ. 125 కోట్లు రూపాయలు బహుమానంగా అందజేశారు. భారీ ఎత్తున ముంబై లో టీమిండియాకు ఘన స్వాగతం పలికింది. వేలాది మంది అభిమానులు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు.
అంతకు ముందు భారత క్రికెటర్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు. అనంతరం ముంబైలో రోడ్ షో చేపట్టారు. బీసీసీఐ ఘణంగా నిర్వహించింది. చిరస్మరణీయమైన రీతిలో వెల్ కమ్ చెప్పింది.