సైబర్ నేరగాళ్ల పట్ల జర జాగ్రత్త
హెచ్చరించిన టీజీఎస్ఆర్టీసీ ఎండీ
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన గత కొంత కాలం నుంచీ సైబర్ నేరాల గురించి చైతన్యవంతం చేస్తూ వస్తున్నారు. గతంలో నగర పోలీస్ కమిషనర్ గా పని చేశారు. పోలీస్ శాఖలో వివిధ హొదాలను సమర్థవంతంగా నిర్వహించారు. ఇదే సమయంలో అప్పటి సర్కార్ ఊహించని రీతిలో నష్టాల్లో ఉన్న టీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు అప్పగించారు.
ఇదిలా ఉండగా వీసీ సజ్జనార్ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటారు. ప్రతి రోజూ తమ సంస్థకు సంబంధించిన సమాచారాన్ని పంచుకుంటారు. ఇదే సమయంలో సైబర్ నేరగాళ్ల పట్ల అవగాహన కల్పిస్తారు. తాజాగా ఓ మహిళకు రూ. 80 లక్షలు టోకరా పెట్టిన వైనం గురించి ఆసక్తికర అంశాన్ని పంచుకున్నారు.
తాము పోలీసులం మాట్లాడుతున్నామని, మనీ లాండరింగ్ కేసు నమోదు అయిందంటూ చెప్పగానే భయ పడవద్దని సూచించారు వీసీ సజ్జనార్. 68 ఏళ్ల బామ్మ వీరి మాటలకు భయపడి పోయి ఏకంగా రూ. 10 లక్షలు చెల్లించిందని తెలిపారు.
వెంటనే ఆమె భయపడకుండా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే సైబర్ నేరగాళ్ల బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసి బాధితురాలి డబ్బులను తిరిగి రప్పించారు.. మోసపోయిన వెంటనే స్థానిక పోలీసులను గానీ, 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని వీసీ సజ్జనార్ సూచించారు.