ఇరాన్ అధ్యక్షుడిగా పెజిష్కియాన్
సంస్కరణ వాదిగా గుర్తింపు
ఇరాన్ – ఇరాన్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో పెజిష్కియాన్ గెలుపొందారు. హార్డ్ లైనర్ జలీలీని ఓడించారు. హెలికాప్టర్ ప్రమాదంలో అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించిన తర్వాత ముందస్తుగా ఎన్నికలు జరిగాయి, గత వారం చారిత్రాత్మకంగా తక్కువ ఓటింగ్‌తో గుర్తించబడిన మొదటి రౌండ్‌ను అనుసరించింది.
మసౌద్ పెజెష్కియాన్ కు 69 ఏళ్లు. ఆయన గుండె శస్త్ర చికిత్స నిపుణుడిగా ఇప్పటి వరకు పని చేస్తూ వచ్చారు. ఇరాన్ ప్రధాన సంస్కరణవాద కూటమి మద్దతును పొందారు. పెజిష్కియాన్ జలీలీపై గెలుపొందినట్లు ఇరాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అధ్యక్ష ఎన్నికల్లో 30 మిలియన్ ఓట్లు పోల్ అయ్యాయి. పెజిష్కాయాన్ కు 16 మిలియన్లకు పైగా ఓట్లు పోల్ అయ్యాయి. జలీలీకి 13 మిలియన్లకు పైగా ఓట్లు వచ్చినట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఓటింగ్‌లో 49.8 శాతం నమోదైందని ఎలక్టోరల్ అథారిటీ ప్రతినిధి మొహ్సేన్ ఎస్లామి తెలిపారు.
చెల్లని బ్యాలెట్ల సంఖ్య 6, 00,000 కంటే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా దేశానికి సేవ చేసేందుకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు పెజిష్కియాన్.