మోడీ సర్కార్ కు మూడింది
మాజీ సీఎం లాలూ ప్రసాద్
బీహార్ – ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ దిన దిన గండంగా నెట్టుకు వస్తోందంటూ ఎద్దేవా చేశారు.
తనకు తెలిసి మోడీ ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా ఉండక పోవచ్చని బాంబు పేల్చారు. బహుషా తనకు కూడా ఆ విషయం తెలుసని, కానీ బయటకు చెప్పుకోలేక పోతున్నాడంటూ మండిపడ్డారు. వచ్చే నెల నాటికి మోడీ సర్కార్ ఉంటుందో లేదో తెలియని పరిస్థితి నెలకొందన్నారు లాలూ ప్రసాద్ యాదవ్.
దేశంలో ఎన్నికలు ఎప్పుడైనా జరగవచ్చని, పార్టీ కార్యకర్తలంతా సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు మాజీ సీఎం. నరేంద్ర మోడీ అత్యంత బలహీనమైన పీఎం అంటూ ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలతో కూడిన భారత కూటమికి మరో 10 సీట్లు వచ్చి ఉండి ఉంటే సీన్ వేరేగా ఉండేదన్నారు లాలూ ప్రసాద్ యాదవ్.