జూలై 23న కేంద్ర బడ్జెట్
22 నుంచి పార్లమెంట్ సమావేశాలు
న్యూఢిల్లీ – కొత్తగా మూడోసారి కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం చరిత్ర సృష్టించనుంది. పార్లమెంట్ సాక్షిగా మూడోసారి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. ఇందులో భాగంగా జూలై 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి.
బడ్జెట్ ప్రవేశ పెట్టనుండడంతో కీలకమైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ తో భేటీ అయ్యారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ప్రస్తుతం 143 కోట్ల మంది భారతీయులపై ఇప్పటికే జీఎస్టీ పేరుతో పన్నుల మోత మోగించింది సదరు మంత్రి.
కాంగ్రెస్ హయాంలో కాపాడుకుంటూ వచ్చిన ప్రభుత్వ రంగ సంస్థలను గంప గుత్తగా అదానీ, అంబానీ, టాటాలకు అప్పగించింది కేంద్రంలోని మోడీ సర్కార్. దీనిపై రాహుల్ గాంధీ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. భారత్ జోడో యాత్ర పేరుతో ప్రజలకు వివరించే ప్రయత్ం చేశారు.
బడ్జెట్ లో కేవలం బడా బిలీయనీర్లకు మేలు చేకూర్చేందుకే పని చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. మొత్తంగా ఈనెల 23న కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.