రైతు సంక్షేమం కేంద్రం లక్ష్యం
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
తమిళనాడు – కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివ రాజ్ సింగ్ చౌహాన్ తమిళనాడులో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు భారతీయ జనతా పార్టీ చీఫ్ కె. అన్నామలై.
తనకు గ్రాండ్ వెల్ కమ్ చెప్పిన అన్నామలైని, ఇతర పార్టీ నేతలను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం శివ రాజ్ సింగ్ చౌహాన్ మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని చెప్పారు.
రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర లభించేలా చేస్తామన్నారు. ఎక్కడా మధ్య దళారులు లేకుండా చూస్తామన్నారు. రైతులు రాజులు కావాలన్నదే తన అభిమతమని చెప్పారు. జూలై 23న పార్లమెంట్ లో ప్రవేశ పెట్టే కేంద్ర బడ్జెట్ లో అత్యధికంగా నిధులు కేటాయించేలా తాను ప్రయత్నం చేస్తానని చెప్పారు శివ రాజ్ సింగ్ చౌహాన్.
పురుగు మందులు లేని సహజ సిద్దమైన వ్యవసాయం సాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర మంత్రి.