NEWSANDHRA PRADESH

బొత్స కామెంట్స్ టీడీపీ సీరియ‌స్

Share it with your family & friends

ఎమ్మెల్యే అమ‌ర్ నాథ్ రెడ్డి కామెంట్

అమ‌రావ‌తి – ఏపీ మాజీ విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చేసిన కామెంట్స్ పై నిప్పులు చెరిగారు టీడీపీ ఎమ్మెల్యే అమ‌ర్ నాథ్ రెడ్డి. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌మ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టు పెట్టింది మీ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కాదా అని నిల‌దీశారు. ఐదున్న‌ర కోట్ల ప్ర‌జ‌ల ఆకాంక్షాల మేర‌కు మీరు ఏనాడైనా ప‌ని చేశారా అని నిల‌దీశారు .

ఇక‌నైనా మీరు చేసిన త‌ప్పులు, మోసాలు, ద‌గాల గురించి ఒక్క‌టొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తాయ‌ని, కాస్తా ఆగితే అన్నీ బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని అన్నారు. అంత తొంద‌ర ప‌డ‌కు బొత్సా అంటూ సెటైర్ వేశారు ఎమ్మెల్యే అమ‌ర్ నాథ్ రెడ్డి.

ఎలాంటి చ‌ర్చ‌లు లేకుండానే ఏపీ భ‌వ‌నాల‌ను తెలంగాణకు అప్ప‌గించింది మ‌రిచి పోతే ఎలా అని మండిప‌డ్డారు. బంద‌ర్ పోర్టులో వాటా ఇస్తామ‌ని చెప్పింది వాస్త‌వం కాదా అని నిప్పులు చెరిగారు. అంతే కాదు తాళాలు ప‌గ‌ల‌గొట్టి ఏపీ ఆయుష్ భ‌వ‌నాన్ని స్వాధీనం చేసుకుంటే నోరు మూసుకున్న‌ది మీరు కాక మ‌రెవ‌రో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఇక్క‌డ ఇప్పుడు ఉన్న‌ది చంద్ర‌బాబు నాయుడు అన్న సంగ‌తి మ‌రిచి పోవ‌ద్దంటూ హెచ్చ‌రించారు.