రాహుల్ గాంధీకి సింగిరెడ్డి లేఖ
ఫిరాయింపులను ప్రోత్సహిస్తే ఎలా
హైదరాబాద్ – మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న విధానం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఫిరాయింపులకు పాల్పడితే రాళ్లతో కొట్టమని చెప్పిన రేవంత్ రెడ్డి ఇవాళ చేస్తున్నది ఏమిటని ప్రశ్నించారు.
ఓ వైపు రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకుని తిరుగుతున్న పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఒక్కసారి తెలంగాణ వైపు చూడాలన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను బలవంతంగా తమ పార్టీలోకి చేర్చుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
ఈ మేరకు ఇవాళ ఆయన బహిరంగ లేఖ రాశారు. ఈ విషయాన్ని వెల్లడించారు. రాహుల్ చేబుతున్నది ఏమిటి..రేవంత్ రెడ్డి చేస్తున్నది ఏమిటి అని నిలదీశారు. రాజ్యాంగాన్ని రాహుల్ గాంధీ అపహాస్యం చేస్తున్నాడని మండిపడ్డారు .
ఏ మాత్రం విలువలకు కట్టుబడి ఉన్నట్లయితే వెంటనే తమ పార్టీకి చెందిన వారితో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.