NEWSANDHRA PRADESH

రేవంత్ రెడ్డికి శ్రీ‌వారి కానుక‌

Share it with your family & friends

అంద‌జేసిన సీఎం చంద్ర‌బాబు
హైద‌రాబాద్ – ఇరు రాష్ట్రాల భేటీలో ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది. ప్ర‌జా భ‌వ‌న్ లో ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిలు తొలిసారిగా భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాలు విడి పోయి 10 ఏళ్లు కావ‌స్తోంది. అయినా ఇప్ప‌టికీ స‌మ‌స్య‌లు ప‌రిష్కారానికి నోచుకోలేదు.

ఏపీ సీఎం ముందుగా చొర‌వ తీసుకున్నారు. వెంట‌నే ప‌రిష్క‌రించుకుందామ‌ని నిర్ణ‌యించారు. ఈ మేర‌కు ముహూర్తం ఖ‌రారు చేశారు. ఢిల్లీ టూర్ ముగించుకుని నేరుగా సిటీకి విచ్చేశారు. అనంత‌రం స‌మావేశ‌మైన ఇద్ద‌రు వివిధ విభ‌జ‌న అంశాల‌పై ప్ర‌ధానంగా చ‌ర్చించారు.

చివ‌ర‌కు ఎటూ కాకుండానే ముగించారు. ఒక‌రినొక‌రు ఆప్యాయంగా ప‌ల‌క‌రించుకున్నారు. ఒక‌ప్పుడు టీడీపీలో ఉన్నారు రేవంత్ రెడ్డి. ఆయ‌న‌ను ప్రోత్స‌హించింది చంద్ర‌బాబే. ఒక ర‌కంగా త‌న‌కు గురువు లాంటి వాడు. ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు ఇచ్చి పుచ్చుకున్నారు..ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు నాయుడు తాను ఆరాధించే శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి చిత్ర‌ప‌టాన్ని, విగ్ర‌హాన్ని అంద‌జేశారు.