స్థిరాస్తులు ఏపీకి ఇచ్చే ప్రసక్తి లేదు
తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల కీలక సమివేశం ముగిసింది. ఈ సందర్బంగా పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో తమకు చెందిన స్థిరాస్తులను కేటాయించాలని కోరారు. కొన్ని భవనాలను ఏపీకి వెంటనే ఇవ్వాలని అన్నారు.
ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ఉన్న ఆస్తులను , స్థిరాస్తులను ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అంతే కాకుండా భద్రాచలం పరిధిలోని ఏడు మండలాల నుంచి బలవంతంగా తీసుకున్న ఏడు గ్రామాలను తిరిగి ఇవ్వాలని కోరారు. ఇందుకు ఓకే చెప్పాలంటే ముందుగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ మేరకు ఇరు రాష్ట్రాల సీఎంలు లేఖలు రాయాలని నిర్ణయించారు. సమావేశంలో ఏ ఒక్క సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. కేవలం ప్రచారం మాత్రం జరిగింది. కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్పై సీఎం రేవంత్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు పథకం వివరాలు కూడా అడిగారు.