తలైవా..మంచు వైరల్
ఇద్దరూ ఒకే విమానంలో
హైదరాబాద్ – ఆ ఇద్దరు లెజెండ్ లు. ఒకరు జగ మెరిగిన సూపర్ స్టార్ రజనీకాంత్. ఇంకొకరు తెలుగు చిత్ర పరిశ్రమలో డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు. ఇద్దరూ కష్టపడి పైకి వచ్చిన వారే. ఇరువురు తమ రంగంలో టాప్ లో కొనసాగుతున్న వారే.
ఈ ఇద్దరూ ఒకరంటే మరొకరికి పంచ ప్రాణం. ఒరేయ్ అనేంత చనువు ఉంది రజనీకాంత్ , మోహన్ బాబుకు. తలైవా, మంచు కలిసి విమానంలో ప్రయాణం చేశారు. ఇద్దరు చాలా సేపు మాట్లాడుకున్నారు. తమ చిన్న నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
ఇదే సమయంలో ఇద్దరూ కలిసి ఒకరిపై మరొకరు చేతులు వేసుకుని ఫోటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం తలైవా, మోహన్ బాబుల ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి.
ఈ ఇద్దరి మధ్య 48 ఏళ్ల స్నేహం ఉంది. అది చెక్కు చెదరకుండా కొనసాగుతూనే ఉంది. ఇరువురు కుటుంబాలు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూనే ఉన్నారు. స్నేహమేరా జీవితం అంటూ సాగి పోతున్నారు.