జింబాబ్వే చేతిలో భారత్ ఓటమి
13 పరుగుల తేడాతో పరాజయం
హరారే – జింబాబ్వే టూర్ లో భాగంగా జరిగిన తొలి టి20 మ్యాచ్ లో ఘోరంగా ఓటమి పాలైంది. నిన్నటి దాకా టి20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన జట్టు ఇదేనా అన్న అనుమానం కలిగింది. బీసీసీఐ ఏరికోరి శుభ్ మన్ గిల్ కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. కేరళ స్టార్ సంజూ శాంసన్ ను పక్కన పెట్టేసింది. మరో ఇద్దరి ఆటగాళ్లపై వేటు వేసింది. కొత్త వారికి ఛాన్స్ ఇచ్చింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే గిల్ 31 , సుందర్ 27 , ఆవేశ్ ఖాన్ 16 పరుగులు చేయడం తప్పితే మిగతా వారు ఎవరూ ప్రతిఘటించ లేక పోయారు. పెవిలియన్ బాట పట్టారు. హరారే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో జింబాబ్బే బౌలర్లు రెచ్చి పోయారు.
చటారా , స్కిప్పర్ సికిందర్ రజా చెరో మూడు వికెట్లు తీశారు. బెన్నట్, మనకద్భా, ముబార బని, జోన్వే చెరో వికెట్ కూల్చారు. ఇవాళ రెండో టి20 మ్యాచ్ జరగనుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్బే 115 రన్స్ చేసింది. ఇండియా స్వల్ప స్కోర్ ను చేదించ లేక పోయింది.