టీడీపీ ఎంపీ వల్లే సీఎం జైలుపాలు
సీఎం కేజ్రీవాల్ భార్య సంచలన కామెంట్స్
న్యూఢిల్లీ – ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇచ్చిన తప్పుడు స్టేట్ మెంట్ కారణంగానే తన భర్త జైలు పాలయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. సునీతా కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తన భర్తకు ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేశారు. కానీ మోడీ, అమిత్ షా కుట్రలలో భాగంగానే కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ప్రధానంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కొడుకును బయటకు తీసుకు వచ్చేందుకు తన భర్తను పావుగా ఉపయోగించు కున్నాడని ఆరోపించారు సునీతా కేజ్రీవాల్.
తన భర్త రాజకీయ కుట్రకు బలి అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ఎంపీ ఇచ్చిన అబద్దపు స్టేట్ మెంట్ కారణంగానే తన భర్తను చెరసాలలో వేశారని ధ్వజమెత్తారు.
తన భర్త నిజాయితీపరుడని, ఆయనకు ప్రజలు మద్దతుగా నిలవక పోతే, చదువుకున్న వారెవరూ రాజకీయాల్లోకి వచ్చేందుకు సాహసించరని సునీతా కేజ్రీవాల్ అన్నారు.