NEWSNATIONAL

చిదంబ‌రం కామెంట్స్ ధ‌న్ క‌ర్ ఫైర్

Share it with your family & friends

అనుచిత వ్యాఖ్య‌లు త‌గ‌ద‌న్న ఉప రాష్ట్ర‌ప‌తి

న్యూఢిల్లీ – దేశంలో కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. బ్రిటీష్ కాలంల త‌యారు చేసిన చ‌ట్టాల‌ను మార్చుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. ఈ సంద‌ర్బంగా కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబ‌రం కొత్త‌గా తీసుకు వ‌చ్చిన క్రిమిన‌ల్ చ‌ట్టాల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పూర్తిగా రాజ‌కీయ దురుద్దేశంతో త‌యారు చేసిన‌వి త‌ప్పా ప్ర‌జ‌ల‌కు మేలు చేకూర్చేలా లేవంటూ పేర్కొన్నారు.

ఈ సంద‌ర్బంగా దేశ ఉప రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధ‌న్ క‌ర్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబ‌రంను ఏకి పారేశారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు త‌న స్థాయికి త‌గ‌వంటూ పేర్కొన్నారు. కొంద‌రు నేత‌లు మ‌న దేశాన్ని కించ ప‌రిచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ప్ర‌ధానంగా మ‌న సంస్థ‌ను కించ ప‌రిచేందుకు ప్ర‌య‌త్నించ‌డం దారుణ‌మ‌న్నారు. మ‌న పురోగ‌తిని క‌లుషితం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. విమ‌ర్శలు చేసే వారు విమ‌ర్శ‌ల‌కు లోన‌వుతార‌ని తెలుసుకోక పోవ‌డం దారుణ‌మ‌న్నారు.

అత్యంత అవ‌మాన‌క‌ర‌మైన చేసిన వ్యాఖ్య‌ల‌ను పి. చిదంబ‌రం లాంటి నేత‌లు ఉప‌సంహ‌రించు కుంటార‌ని భావిస్తున్న‌ట్లు తెలిపారు.