NEWSANDHRA PRADESH

సోనియా న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటా

Share it with your family & friends

ధ‌న్య‌వాదాలు తెలిపిన వైఎస్ ష‌ర్మిలా రెడ్డి

అమ‌రావ‌తి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం ఆమె ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. త‌న తండ్రి, దివంగ‌త ఏపీ సీఎం డాక్ట‌ర్ వైఎస్ రాజశేఖ‌ర్ రెడ్డి 75వ జ‌యంతి. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని ఏపీ పీసీసీ పెద్ద ఎత్తున కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తోంది. భారీ ఎత్తున స‌మావేశాన్ని కూడా నిర్వ‌హించనుంది.

ఈ సంద‌ర్బంగా వైఎస్ ష‌ర్మిలా రెడ్డి ప్ర‌ముఖ నేత‌ల‌ను క‌లుసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని, క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ తో పాటు దేశంలోని ప్ర‌ముఖ నేత‌ల‌ను రావాల్సిందిగా కోరారు . వారంతా ష‌ర్మిలా రెడ్డి చేసిన విన్న‌పాన్ని స్వీక‌రించారు. త‌ప్ప‌కుండా వ‌స్తామ‌ని మాటిచ్చారు.

ఇదిలా ఉండ‌గా వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డితో త‌మ‌కు ఉన్న అనుబంధాన్ని, పార్టీకి ఆయ‌న అందించిన సేవ‌ల‌ను గుర్తు చేసుకున్న సోనియా గాంధీకి ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.

. ఈ సందర్భంగా, త‌న పై మీరు ఉంచిన నమ్మకాన్ని నిల‌బెట్టుకుంటాన‌ని తెలిపారు. రాహుల్ గాంధీ ఆశ‌యాల సాధ‌న కోసం తాను పోరాడుతాన‌ని పేర్కొన్నారు.