జగన్నాథుడికి గవర్నర్ పూజలు
పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్
మల్కాజిగిరి – మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో భారీ ఎత్తున పూరీ జగన్నాథుడి రథయాత్రను నిర్వహించారు. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ కేపీ రాధాకృష్ణన్ హాజరయ్యారు. ఆ జగన్నాథుడికి పూజలు చేశారు. హారతి ఇచ్చారు.
మేడ్చల్ లోని శివ సాయి ఫంక్షన్ హాలలో ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో జగన్నాథుడి రథ యాత్ర చేపట్టారు. ఈ సందర్బంగా గవర్నర్ కేపీ రాధాకృష్ణన్ మాట్లాడారు. సకల మతాలు ఒక్కటేనని అన్నారు. ఎవరి విశ్వాసాలు ఏవైనప్పటికీ మనందరం కలిసికట్టుగా ఉండేందుకు ఇలాంటి ఉత్సవాలు దోహద పడతాయని చెప్పారు.
సత్యం, ధర్మం , నిష్టత ఎప్పటికీ చెక్కు చెదరవని పేర్కొన్నారు. ధర్మ బద్దమైన జీవితం గడిపేందుకు ఇస్కాన్ తోడ్పడుతుందని అన్నారు. ఆనాడు ప్రభు పాదుల వారు ఏర్పాటు చేసిన ఇస్కాన్ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చూస్తేనే ఉందన్నారు గవర్నర్ కేపీ రాధాకృష్ణన్.