నేటి నుంచి ఏపీలో ఉచితంగా ఇసుక
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు
అమరావతి – ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఉచితంగా ఇసుకను ఇస్తానని చెప్పారు. ఇచ్చిన మాట మేరకు కట్టుబడి ఉన్నానని ప్రకటించారు.
ఈ మేరకు నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా ఇసుకను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కొలువు తీరిన 20 రోజుల్లోనే అమలులోకి రావడం విశేషం.
గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇసుకకు సంబంధించి. ఇక నుంచి అలాంటి కష్టాలు ఉండవని పేర్కొంది సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి 20 జిల్లాల్లో ఉచిత ఇసుక విధానం అములోకి రానుంది.
ఇసుక తవ్వకాలు, రవాణా ఖర్చులు వంటి నామమాత్రపు చార్జీలతో, ప్రభుత్వం రూపాయి ఆదాయం తీసుకోకుండా, ప్రజలకు ఉచిత ఇసుక ఇవ్వనుంది. అక్రమాలు అరికట్టటానికి, చెల్లింపులు కూడా డిజిటల్ పద్దతిలోనే ఉంటాయని పేర్కొంది.