ఇంధన శాఖపై శ్వేత పత్రం రిలీజ్
ఇప్పటికే రెండు శ్వతే పత్రాలు విడుదల
అమరావతి – ఏపీలో కొలువు తీరిన కూటమి సర్కార్ రాష్ట్ర ప్రగతికి సంబంధించి కీలకమైన శ్వేత పత్రాలు విడుదల చేస్తూ వస్తోంది. వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో అనే దానిపై ప్రజలకు తెలియ చేస్తోంది. ఇప్పటికే రెండు శ్వేత పత్రాలను విడుదల చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.
తాజాగా సోమవారం మూడో శ్వేత పత్రాన్ని విడుదల చేయనున్నారు ఏపీ సీఎం. ఇప్పటికే పోలవరం, అమరావతి రాజధానిపై శ్వతే పత్రం రిలీజ్ చేశారు నారా చంద్రబాబు నాయుడు. మూడో శ్వేత పత్రంగా ఇంధన శాఖపై విడుదల చేసేందుకు రెడీ అయ్యారు.
ప్రస్తుతం ఇంధన శాఖపై వాస్తవ పరిస్థితులను అద్దం పట్టేలా పూర్తి వివరాలతో రిలీజ్ చేయనున్నారు. గత ప్రభుత్వం ఇంధన శాఖ ను నిర్వీర్యం చేసిన తీరు వివరించారు. ఇంధన శాఖను గాడిలో పెట్టేందుకు తీసుకుంటున్న చర్యల గురించి తెలిపారు నారా చంద్రబాబు నాయుడు.