మణిపూర్ బాధితులకు రాహుల్ భరోసా
సందర్శించిన రాయ్ బరేలి ఎంపీ
మణిపూర్ – విద్వేషాల సుడి గుండంలో కొట్టుకు పోతున్న మణిపూర్ ను సోమవారం సందర్శించారు రాయ్ బరేలి ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. ఈ సందర్బంగా బాధితులు పోటెత్తారు. ఆయనను కలిసేందుకు. తమ బాధలు చెప్పుకునేందుకు. వారందరితో ఓపికగా విన్నారు. గత కొంత కాలంగా మణిపూర్ లో చోటు చేసుకుంటున్న అల్లర్లపై పెద్ద ఎత్తున ప్రస్తావిస్తున్నారు. ప్రధానంగా లోక్ సభలో సైతం చర్చించాలని పట్టుపట్టారు రాహుల్ గాంధీ.
కానీ కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ ఒప్పు కోలేదు. స్పీకర్ ఓం బిర్లా చర్చకు అనుమతించ లేదు. దీనిపై నిరసన వ్యక్తం చేశారు. ఆపై ప్రతిఫక్షాలన్నీ కలిసి వాక్ ఔట్ చేశాయి. ఇది సరైన పద్దతి కాదంటూ నిప్పులు చెరిగారు రాహుల్ గాంధీ. ఓ వైపు ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవాళ స్వయంగా మరోసారి మణిపూర్ లో పర్యటించారు. కళ్లు చెమర్చేలా దృశ్యాలు చోటు చేసుకున్నాయి. రాహుల్ గాంధీ బాధితులతో ముచ్చటించారు. ఆయన హృదయం బరువుతో నిండి పోయింది. ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రస్తావించారు.