నారా లోకేష్ ప్రజా దర్బార్
పోటెత్తిన బాధితులు
మంగళగిరి – ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం తన నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాధితులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. తమ సమస్యలను విన్నవించారు.
ఆయన మంత్రిగా కొలువు తీరిన వెంటనే ప్రజా దర్బార్ కు శ్రీకారం చుట్టారు. ఎవరైనా ఏ పార్టీకి చెందిన వారైనా ఏ కులం, మతానికి చెందిన వారైనా సరే తన వద్దకు రావచ్చని, తన గేట్లు , తలుపులు తెరుచుకునే ఉంటాయని ప్రకటించారు. ప్రజల సాక్షిగా చేసిన మాటకు కట్టుబడి ఉన్నారు. బాధితులతో నేరుగా మాట్లాడుతూనే మరో వైపు సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు. వెంటనే సంబంధిత సమస్యలు పరిష్కారం అయ్యేలా చేస్తున్నారు.
మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉండవల్లి నివాసంలో మంత్రిని నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవిస్తున్నారు. అందరి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.