వరల్డ్ కప్ విజేతకు ప్రైజ్ మనీ
ప్రకటించిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు
ముంబై – రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఐసీసీ టి20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. చివరకు టీమిండియా 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. విశ్వ విజేతగా నిలిచింది. ఈ సందర్బంగా ఐసీసీ ప్రైజ్ మనీని డిక్లేర్ చేసింది. దీనిని మొత్తం జట్టు సభ్యులతో పాటు ఇతర సిబ్బందికి పంపిణీ చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ).
అంతే కాదు ఎవరూ ఊహించని రీతిలో , భారత దేశ క్రీడా చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఏకంగా రూ. 125 కోట్లు బహుమానంగా ఇస్తున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా టి20 వరల్డ్ కప్ లో పాలు పంచుకున్న క్రికెటర్లకు ప్రైజ్ మనీని డిస్ట్రిబ్యూట్ చేసింది.
మొత్తం 15 మంది ఆటగాళ్లకు ఒక్కో ఆటగాడికి రూ. 5 కోట్ల చొప్పున , హెడ్ కోచ్ కు రూ. 5 కోట్ల చొప్పున పంపిణీ చేయనుంది. మిగిలిచన కోచింగ్ గ్రూప్ లో ఒక్కొక్కరికీ రూ. 2.5 కోట్లు, బ్యాక్ రూమ్ సిబ్బందికి ఒక్కొక్కరికీ రూ. 2 కోట్లు, సెలక్షన్ కమిటీకి ఒక్కొక్కరికీ రూ. కోటి, రిజర్వ్ ఆటగాళ్లకు ఒక్కొక్కరికీ రూ. ఒక కోటి ఇవ్వనుంది.