NEWSANDHRA PRADESH

అంబ‌టి కామెంట్స్ టీడీపీ సీరియ‌స్

Share it with your family & friends

డ్ర‌గ్స్ ఏమైనా పెద్ద స‌మ‌స్యా

అమ‌రావ‌తి – మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్ప‌టికే డ్ర‌గ్స్ ర‌హితంగా రాష్ట్రాన్ని త‌యారు చేయాల‌ని సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కంక‌ణం క‌ట్టుకున్నారు. ఇందులో భాగంగా ఎవ‌రైనా ఎంత‌టి వారైనా ఏ పార్టీకి చెందిన వారైనా స‌రే ఉక్కుపాదం మోపుతామ‌ని హెచ్చ‌రించారు. ఇప్ప‌టికే ఆదేశాలు కూడా జారీ చేసింది ఏపీ స‌ర్కార్.

ఈ స‌మ‌యంలో ఎక్క‌డిక‌క్క‌డ పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. డ్ర‌గ్స్ , మత్తు ప‌దార్థాల కార‌ణంగా యువ‌త త‌ప్పుదోవ ప‌డుతోంద‌ని, అత్యాచారాలు, హ‌త్య‌లు జ‌రుగుతున్నాయ‌ని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఈ త‌రుణంలో ఒక బాధ్య‌త క‌లిగిన మంత్రి ప‌ద‌విని వెల‌గ‌బెట్టి ఓట‌మి పాలైన అంబ‌టి రాంబాబు ఉన్న‌ట్టుండి పుండు మీద కారం చ‌ల్లేలా కామెంట్స్ చేశారు. డ్ర‌గ్స్ ఏమైనా పెద్ద స‌మ‌స్యా అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు.

.యువతని నిర్వీర్యం చేసి, స్కూల్స్ లో కూడా పిల్లలకు గంజాయి అలవాటు చేసి, సొమ్ము చేసుకున్న, మీ ముఠా మొత్తానికి ఇది చిన్న సమస్యగానే ఉంటుంది జగన్ రెడ్డి. ఇలాంటి పనులకే మీకు ప్రజలు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చారంటూ టీడీపీ పేర్కొంది. .