ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తా
ఎమ్మెల్సీ పి. హరి ప్రసాద్ కామెంట్
అమరావతి – శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైన జనసేన పార్టీకి చెందిన పి. హరి ప్రసాద్ సోమవారం ధ్రువీకరణ పత్రం తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తనపై నమ్మకం ఉంచి గురుతరమైన బాధ్యత అప్పగించిన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కు రుణపడి ఉంటానని అన్నారు.
తాను తన మూలాలను మరిచి పోనని , రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు హరి ప్రసాద్. ఎన్డీయే కూటమిలో భాగంగా జనసేన తరఫున నామినేషన్ దాఖలు చేసిన హరిప్రసాద్ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవాళ అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించారు.
ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు. శాసన మండలి సభ్యత్వాన్ని బాధ్యతాయుతమైన పదవిగా భావిస్తున్నానని అన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు హరి ప్రసాద్.
శాసన మండలి తొలి సమావేశాల ప్రారంభానికి సమయం ఉన్నందున కౌన్సిల్ సమావేశాలు, ప్రశ్నోత్తరాలు, చర్చ, భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశాలపై అధ్యయనం చేయడానికి నాకు ఈ సమయం ఉపయోగపడుతుందని అన్నారు.