నీట్ పేపర్ లీక్ వాస్తవమే
కీలక వ్యాఖ్యలు చేసిన సీజేఐ
న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. దీనికి ప్రధాన కారణం ఇవాళ సుప్రీంకోర్టు నీట్ 2024 పరీక్ష లీకేజీ వ్యవహారంపై విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నీట్ పేపర్ లీక్ అయ్యిందన్నది వాస్తవమేనని పేర్కొన్నారు. దీనికి నివారణ ఎలా అన్నదే తమ ముందున్న సమస్య అని స్పష్టం చేశారు.
పేపర్ లీక్ జరిగిన దానిపై విచారణ చేపట్టాలని ఆదేశించారు. గత నెలలో విడుదలైన నీట్-యుజి పరీక్ష ఫలితాలలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, లీకేజీల కారణంగా చదువుకోని వారు టాప్ లో వచ్చారని ఆరోపించారు విద్యార్థులు. ఈ మేరకు దేశ వ్యాప్తంగా రోడ్డెక్కారు. ప్రతిష్టాత్మకమైన నీట్ యూజీ పరీక్ష ఇలా పక్కదారి పట్టడంపై ఆందోళన బాట పట్టారు.
పరీక్షను తిరిగి నిర్వహించాలన్న డిమాండ్ పై సుప్రీంకోర్టు ఆచి తూచి అడుగులు వేయాలని సూచించింది. 1,563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపాలా లేదా కొత్తగా పరీక్షలు చేపట్టాలా అన్నది ఆలోచిస్తున్నట్లు పేర్కొంది.
24 లక్షల మంది విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించడం అసహ్యకరమని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది . వీరిలో చాలా మంది పేద కుటుంబాలకు చెందిన వారు , పరీక్షా కేంద్రాలకు వెళ్లడానికి డబ్బు ఖర్చు చేయలేరని తెలిపింది.
ఒక విషయం స్పష్టంగా ఉంది.. ప్రశ్నలు లీక్ అయ్యాయి. పరీక్ష పవిత్రత రాజీ పడింది. ఇది సందేహాస్పదంగా ఉంది. ఇప్పుడు మనం లీకేజీని నిర్ధారించాల్సి ఉందన్నారు ప్రధాన న్యాయమూర్తి .
ప్రశ్నల లీక్ , పరీక్ష నిర్వహణకు మధ్య తగినంత సమయం ఉంటే తిరిగి పరీక్షకు ఆదేశించవచ్చని కోర్టు నొక్కి చెప్పింది.