NEWSNATIONAL

సీఎం యోగి స్ట్రాంగ్ వార్నింగ్

Share it with your family & friends

ఆయుధాల‌తో తిరిగితే జైలుకే

ఉత్త‌ర్ ప్ర‌దేశ్ – యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎవ‌రైనా ఆయుధాల‌ను ధ‌రించినా లేదా ఉప‌యోగించినా లేదా బ‌హిరంగంగా ప్ర‌ద‌ర్శించినా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ఎవ‌రైనా కాదు కూడ‌ద‌ని ముందుకు వ‌స్తే వెంట‌నే అరెస్ట్ చేయ‌డం జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం.

యూపీలో త్వ‌ర‌లో మొహ‌ర్రం సంద‌ర్బంగా దానిని అడ్డం పెట్టుకుని ర్యాలీలు చేప‌ట్ట‌డం, ప్ర‌ద‌ర్శ‌న‌లు చేయ‌డం, ఊరేగింపులు నిర్వ‌హించ‌డాన్ని తాము ఒప్పుకునే ప్ర‌స‌క్తి లేద‌ని పేర్కొన్నారు సీఎం యోగి ఆదిత్యానాథ్.

ఆయుధాలు క‌లిగి ఉండ‌డంతో పాటు వాటిని ప్ర‌ద‌ర్శించ‌డం నిషేధ‌మ‌ని తెలిపారు. ఇలాంటి వాటిని త‌మ స‌ర్కార్ భ‌రించద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం. సోమ‌వారం ఉన్న‌తాధికారుల‌తో త‌న ఛాంబ‌ర్ లో స‌మీక్ష చేప‌ట్టారు. ప్ర‌ధానంగా ఆయుధాలు క‌లిగి ఉండడాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు.

సామాన్య ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు క‌లిగించే సంప్రదాయం యూపీలో ఉండ‌బోద‌ని యోగి ఆదిత్యానాథ్ పేర్కొన్నారు. దీంతో రౌడీ షీట‌ర్లు, మాఫియా టీమ్ ల‌కు ఒక ర‌కంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన‌ట్ల‌యింది.