ప్రజా పాలన కాదు ఆంధ్రా పాలన
ధ్వజమెత్తిన అనుగుల రాకేశ్ రెడ్డి
హైదరాబాద్ – బీఆర్ఎస్ నేత అనుగుల రాకేష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పిన సీఎం అధికారంలోకి వచ్చాక మాట మార్చాడని , ఇప్పటి దాకా ఒక్క పోస్టు కూడా నింప లేదని ఆరోపించారు.
ఓ వైపు నిరుద్యోగులు కష్టపడి ఊరూరా తిరిగి ఓట్లు వేయించి కాంగ్రెస్ గద్దెనెక్కేలా చేస్తే ఇవాళ అదే నిరుద్యోగులపై పోలీసులను ఉసి గొల్పడం, దాడులకు పాల్పడడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
ఖాకీల కర్కశర్వానికి కడుపులు మాడ్చుకుంటూ కారు చీకట్లో చైతన్య గీతాలు పాడుతూ తమ నిరసన తెలుపుతున్నారని తెలిపారు అనుగుల రాకేష్ రెడ్డి. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడం కాంగ్రెస్ డీఎన్ఏ లోనే ఉందన్నారు.
రేవంత్ రెడ్డ గురువు చంద్రబాబు నాయుడు ఆనాడు బషీర్ బాగ్ లో రైతుల ప్రాణాలు బలికొంటే, ఈ రేవంత్ రెడ్డి తన సిఎం పదవికి నిరుద్యోగులను, వాళ్ల కన్నీళ్ళ ను, రక్తాన్ని అర్పిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. .