సీఎం పాలమూరు టూర్
సమీక్షలు..ప్రారంభోత్సవాలు
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మంగళవారం పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా ఆయన పలు అభివృద్ది పనులను ప్రారంభిస్తారు. ఇదే సమయంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు.
ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి పాలమూరుకు ఫ్లైట్ లో వెళతారు. 12.45 గంటలకు పాలమూరుకు చేరుకుంటారు.12.45 నుండి 1.00 గంట వరకు ఐటీఓసీ వద్ద ప్లాంటేషన్ కార్యక్రంలో పాల్గొంటారు. అనంతరం పాలమూరు జిల్లా ప్రముఖులతో ముఖాముఖి ఉంటుంది.
మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభిస్తారు. పలు అభివృద్ది పనులకు శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.1.15 గంట నుండి 4.45 గంటల వరకు మహబూబ్ నగర్ లోని ఐడీఓసీ లో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష సమావేశంలో పాల్గొంటారు రేవంత్ రెడ్డి.
5 గంటల నుండి 5.45 గంటల వరకు భూత్పూర్ రోడ్డు లోని ఏఎస్ఎన్ కన్వెన్షన్ హాలులో పార్టీకి చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులతో సమావేశం కానున్నారు. సాయంత్రం 6 గంటలకు పర్యటన ముగించుకుని తిరిగి హైదరాబాద్ వెళతారు.