NEWSTELANGANA

పాల‌కుర్తి అభివృద్దికి నిధులు ఇవ్వండి

Share it with your family & friends

సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్

హైద‌రాబాద్ – త‌మ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్దికి స‌హాయ స‌హ‌కారాలు అందించాల‌ని కోరారు నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే య‌శ‌స్విని రెడ్డి. ఆమె మ‌ర్యాద పూర్వ‌కంగా సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిని క‌లుసుకున్నారు. ఈ సంర‌ద్బంగా త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించారు. ఇదే స‌మ‌యంలో అన్ని రంగాల‌లో వెనుక‌బాటుకు గురైంద‌ని, దీనిని ముందంజ‌లో తీసుకు వెళ్లేందుకు సాయం చేయాల‌ని కోరారు. ఈ మేర‌కు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డికి విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించారు ఎమ్మెల్యే య‌శ‌స్విని రెడ్డి.

కీల‌క‌మైన అభివృద్ది ప‌నులు చేపేట్టేందుకు ప్ర‌భుత్వ ప‌రంగా ఇతోధికంగా సాయం చేయాల‌ని విన్న‌వించారు. ఇందుకు సంబంధించి పూర్తిగా విన్న సీఎం సానుకూలంగా స్పందించ‌డ‌మే కాకుండా వీలైనంత మేర అత్య‌ధికంగా నియోజ‌క‌వ‌ర్గం అభివృద్దికి తోడ్పాటు అందిస్తాన‌ని పూర్తి భ‌రోసా ఇచ్చార‌ని తెలిపారు ఎమ్మెల్యే య‌శ‌స్విని రెడ్డి.

ఈ సంద‌ర్బంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇలాంటి ఉత్సాహ‌వంతుడైన నాయ‌కుడు త‌మ‌కు సీఎంగా ఉన్నందుకు సంతోషంగా ఉంద‌న్నారు.