గచ్చిబౌలిలోనే స్కిల్ యూనివర్శిటీ
దాని వైపే మొగ్గు చూపిస సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – సీఎంగా కొలువు తీరిన ఎనుముల రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ఆయన పదే పదే నైపుణ్యాభివృద్ది గురించి ప్రస్తావిస్తూ వస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే స్కిల్ డెవలప్ మెంట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి నైపుణ్యాభివృద్దికి సంబంధించి నిధులు కూడా మంజూరు చేశారు.
తాజాగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తో కలిసి గచ్చిబౌలి లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీని సందర్శించారు. తక్షణమే స్కిల్ యూనివర్శిటీ (నైపుణ్యాభివృద్ది విశ్వ విద్యాలయం )ని ఏర్పాటు చేయడం గురించి పరిశీలించారు. సాధ్యా సాధ్యాలను బేరీజు వేశారు.
అనంతరం కీలక సమావేశంలో చివరకు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలోనే స్కిల్ యూనివర్శిటీని యుద్ద ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. ఇక్కడ ఉండడం వల్ల అందరికీ అందుబాటులో ఉంటుందని అభిప్రాయపడ్డారు.