NEWSANDHRA PRADESH

బ్యాంక‌ర్ల క‌మిటీపై బాబు ఫోక‌స్

Share it with your family & friends

కీలంక అంశాల‌పై చ‌ర్చ‌

అమ‌రావ‌తి – ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయ‌న ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నే రాష్ట్రంలో వివిధ శాఖ‌ల‌పై ఫోక‌స్ పెట్టారు. త‌న హ‌యాంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల‌లో ముందంజ‌లో నిల‌పాల‌ని ధ్యేయంగా పెట్టుకున్నారు. ఆ దిశ‌గా అడుగులు వేయ‌డం ప్రారంభించారు. మొద‌ట‌గా గ‌త ప్ర‌భుత్వంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ త‌మ‌ను ఇబ్బంది పెట్టిన ఉన్న‌తాధికారుల‌పై వేటు వేశారు. త‌న‌కు సానుకూలంగా ఉన్న ఐఏఎస్ లు, ఐపీఎస్ ల‌ను తీసుకు వ‌చ్చారు. ఇందులో భాగంగా సీఎస్ ను మార్చేశారు. ఆయ‌న స్థానంలో నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్ కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

ఇక తిరుమ‌ల‌పై ఫోక‌స్ పెట్టారు. అక్క‌డ రాజ‌కీయాల‌కు తావు లేదంటూ స్ప‌ష్టం చేశారు. వెంట‌నే ఈవోగా ఉన్న ధ‌ర్మా రెడ్డిపై వేటు వేశారు. ఆయ‌న స్థానంలో నిజాయితీ ఆఫీస‌ర్ గా పేరు పొందిన జె. శ్యామ‌లా రావును నియ‌మించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఎన్ కౌంట‌ర్ స్పెష‌లిస్ట్ గాపేరు పొందిన మ‌హేష్ చంద్ర ల‌డ్హా ను తీసుకు వ‌చ్చారు.

ఇవాళ కీల‌క‌మైన స‌మావేశం నిర్వ‌హించారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఏపీ బ్యాంక‌ర్ల క‌మిటీతో కీల‌క భేటీ కానున్నారు. వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలపై చర్చించనున్నారు.