NEWSANDHRA PRADESH

ఏపీఎస్ఆర్టీసీ సేవ‌లు భేష్ – నాదెండ్ల‌

Share it with your family & friends

ప్ర‌శంసించిన మంత్రి మ‌నోహ‌ర్

అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ప్ర‌యాణీకుల‌ను చేర వేయ‌డంలో కీల‌క‌మైన పాత్ర పోషిస్తోంద‌ని కొనియాడారు రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్. ఇవాళ తెనాలి ఆర్టీసీ డిపోలో తెనాలి నుండి బెంగ‌ళూరు, విజ‌య‌వాడ‌, త‌దిత‌ర ప్రాంతాల‌కు నూత‌న బ‌స్సుల‌ను ప్రారంభించారు మంత్రి.

ప్రారంభించిన అనంత‌రం నాదెండ్ల మ‌నోహ‌ర్ మాట్లాడారు. త‌మ కూట‌మి ప్ర‌భుత్వం ఆర్టీసిని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటుంద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రు త‌మ త‌మ విధుల‌ను స‌రిగా నిర్వ‌హించ‌డం అభినంద‌నీయ‌మ‌ని అన్నారు.

ప్ర‌తి రోజూ ల‌క్ష‌లాది మంది ఆర్టీసీ బ‌స్సుల ద్వారా వివిధ ప్రాంతాల‌కు నిత్యం ప్ర‌యాణం చేస్తున్నార‌ని, వారిని వారి వారి గ‌మ్య స్థానాల‌కు చేర్చ‌డంలో ఇతోధికంగా సేవ‌లు అందిస్తున్నారంటూ డ్రైవ‌ర్లు, కండ‌క్ట‌ర్లు, ఇత‌ర సిబ్బందిని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు నాదెండ్ల మ‌నోహ‌ర్. మ‌రికొన్ని స‌ర్వీసుల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌వేశ పెట్ట‌డం జ‌రుగుతుంద‌న్నారు.