మోడీకి అపూర్వ ఆదరణ
రష్యాలో గ్రాండ్ వెల్ కమ్
రష్యా – రష్యా టూర్ లో భాగంగా అక్కడికి చేరుకున్న భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి గ్రాండ్ వెల్ కమ్ లభించింది. ఎక్కడ చూసినా జనం ఆయనను అక్కున చేర్చుకునేందుకు తహ తహ లాడారు. ప్రపంచంలోనే మోస్ట్ ఫెవరబుల్ లీడర్ గా ఇప్పటికే పేరు పొందారు నరేంద్ర దామోదర దాస్ మోడీ.
భారత దేశంలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ కొనసాగుతోంది. గతంలో కంటే సంఖ్యా బలం తగ్గినా తిరిగి మూడోసారి పీఎంగా కొలువు తీరారు. కొత్త చరిత్ర సృష్టించారు భారత రాజకీయాలలో.
1965 తర్వాత అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ పేరు మీద ఉన్న రికార్డ్ ను నరేంద్ర మోడీ సమం చేశారు. నెహ్రూ వరుసగా మూడుసార్లు పీఎంగా కొనసాగారు. ఇదే సమయంలో 2014, 1019, 2024లో వరుసగా నరేంద్ర మోడీ ప్రధానిగా కొలువు తీరి తనపై ఉన్న రికార్డును సమం చేయడం విశేషం. ఇదిలా ఉండగా తాను ఎన్నికయ్యాక తొలిసారిగా విదేశీ పర్యటన చేశారు రష్యాకు. ఇరు దేశాల మధ్య అవినాభావ సంబంధం నెలకొని ఉన్నది.