ఇసుక ఉచితం జనం సంతోషం
ఏపీ సర్కార్ నిర్ణయం సూపర్
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్రంలోని ఐదున్నర కోట్ల మంది ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే దూకుడు పెంచారు. కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఖుష్ కబర్ చెప్పారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు. పెన్షన్లను అందజేశారు. ఇదే సమయంలో మరో ప్రధాన హామీ ఇసుకను ఉచితంగా ఇస్తామని ప్రకటించారు.
ఇచ్చిన మాట మేరకు తన మాటను నిలబెట్టుకున్నారు. ఉచితంగా ఇసుకను అందజేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కొలువు తీరిన వైఎస్ జగన్ రెడ్డి సర్కార్ ఇసుకను బేరానికి పెట్టింది. భారీ ఎత్తున కొరత కూడా సృష్టించింది. దీంతో ఇళ్ల నిర్మాణంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. సామాన్యులు కొనలేని స్థితికి తీసుకు వచ్చారు ఇసుకను.
ఈ సమస్యను గుర్తించిన చంద్రబాబు నాయుడు ఇసుకను అందరికీ ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా. కేవలం రవాణా, లోడింగ్ చార్జీలు మాత్రమే చెల్లిస్తే చాలు ఇసుకను తీసుకు వెళ్లే వెసులుబాటు కల్పించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.