DEVOTIONAL

అక్టోబ‌ర్ లో శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు

Share it with your family & friends

షెడ్యూల్ రిలీజ్ చేసిన టీటీడీ

తిరుమ‌ల – తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు వ‌చ్చే అక్టోబ‌ర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. ఇందులో భాగంగా షెడ్యూల్ విడుద‌ల చేసింది.

అక్టోబ‌ర్ 3వ తేదీన గురువారం రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు అంకురార్ప‌ణ‌, విశ్వ‌క్సేన ఆరాధ‌న జ‌రుగుతుంది. 4న శుక్ర‌వారం 1వ రోజు మధ్యాహ్నం: 3.30 నుండి 5.30 వరకు బంగారు తిరుచ్చి ఉత్సవం
సాయంత్రం: సుమారు 6 గంటలకు – ద్వజారోహణం , రాత్రి: 9 గంటల నుండి 11 గంటల వరకు – పెద్ద శేష వాహనం పై స్వామి వారు ఊరేగుతార‌ని తెలిపింది టీటీడీ.

ఇక అక్టోబ‌ర్ 5న శ‌నివారం 2వ రోజు ఉదయం: 8 నుండి 10 వరకు – చిన శేష వాహనం, మధ్యాహ్నం 1 గంటల నుండి 3 గంటల వరకు – స్నపన తిరుమంజనం (ఉత్సవర్లకు అభిషేకం), రాత్రి: 7 నుండి 9 గంటల వరకు – హంస వాహనం కార్య‌క్ర‌మం ఉటుంద‌ని స్ప‌ష్టం చేసింది.

6న‌ ఆదివారం – 3వ రోజు ఉదయం: 8 నుండి 10 వరకు – సింహవాహనం, మధ్యాహ్నం 1 గంటల నుండి 3 గంటల వరకు – స్నపన తిరుమంజనం (ఉత్సవర్లకు అభిషేకం), రాత్రి: 7 గంటల నుండి 9 గంటల వరకు – ముత్యాల పల్లకీ వాహనం ఉంటుంద‌ని టీటీడీ తెలిపింది.

7న సోమ‌వారం 4వ రోజు ఉదయం 8 నుండి 10 వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం: 7 గంటల నుండి 9 గంటల వరకు – సర్వభూపాల వాహనం జ‌రుగుతుంద‌ని పేర్కొంది.

8న మంగళవారం – 5వ రోజు ఉదయం: 8 నుండి 10 వరకు – మోహినీ అవతారం,_ రాత్రి: సుమారు 7 గంటల నుండి 12 గంటల వరకు – గరుడ వాహనంపై స్వామి వారు ఊరేగుతారు.

9న బుధ‌వారం 6వ రోజు ఉదయం: 8 నుండి 10 వరకు – హనుమంత వాహనం, సాయంత్రం: 4 నుండి 5 గంటల వరకు – స్వర్ణ రథోత్సవం , రాత్రి: 7 గంటల నుండి 9 గంటల వరకు – గజవాహనం నిర్వ‌హించ‌నున్నారు.

10న గురువారం 7వ రోజు ఉదయం: 8 నుండి 10 వరకు సూర్య ప్రభ వాహనం, మధ్యాహ్నం: మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం (ఉత్సవర్లకు అభిషేకం), రాత్రి: 7 గంటల నుండి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం జ‌రుగుతుంది.

11న‌ శుక్రవారం – 8వ రోజు ఉదయం 6 గం – రథోత్సవం (రథం, రథోత్సవం), సాయంత్రం: 7 గంటల నుండి 9 గంటల వరకు – అశ్వవాహనంపై స్వామి వారు ఊరేగుతారు.

12న శనివారం – 9వ రోజుతెల్లవారుజామున 3 నుండి 6 గంటల వరకు – పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం నిర్వ‌హిస్తారు. ఉదయం 6 నుండి 9 వరకు – స్నపన తిరుమంజనం, చక్రస్నానం జ‌రుగుతుంద‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం వెల్ల‌డించింది.