బెజవాడ కిడ్నీ రాకెట్ పై విచారణ
ఆదేశించిన ఏపీ మంత్రి అనిత
అమరావతి – ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. విజయవాడ లో ఆలస్యంగా వెలుగు చూసింది కిడ్నీ రాకెట్ వ్యవహారం. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. వెంటనే విచారణకు ఆదేశించారు.
కిడ్నీ బాధితుడు మధుబాబు ఫిర్యాదు చేయడంపై అభినందించారు . ఈ విషయంపై ఆరా తీశారు వంగలపూడి అనిత. వెంటనే గుంటూరు , కృష్ణా జిల్లాల ఎస్పీలతో మాట్లాడారు. విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు. ఎక్కడా నిర్లక్ష్యం చేయకుండా ఎవరెవరు ఈ కిడ్నీ రాకెట్ లో పాలు పంచుకున్నారో తనకు వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు వంగలపూడి అనిత.
విజయవాడ కిడ్నీ రాకెట్ లో హస్తం ఉన్న ఎవరైనా, ఏ పార్టీకి చెందిన వారైనా , ఎవరి హస్తం ఉన్నా సరే వదిలి పెట్ట వద్దని హెచ్చరించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులకు న్యాయం చేయాలని స్పష్టం చేశారు వంగలపూడి అనిత.