ప్రజా దర్బార్ కు పోటెత్తారు
సమస్యల పరిష్కారంపై ఫోకస్
అమరావతి – ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఫుల్ ఫోకస్ పెట్టారు . ఆయన చేపట్టిన ప్రజా దర్బార్ కు ఆశించిన దానికంటే ఎక్కువ గా జనం స్పందిస్తున్నారు. సమస్యలు ఏకరువు పెడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సత్వర న్యాయం జరుగుతోంది. తన మంగళగిరి నియోజకవర్గంతో పాటు చుట్టు పక్కల నియోజకవర్గాల నుంచి ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు బారులు తీరారు.
అయినా ఎక్కడా విసుగు చెందకుండా ప్రతి ఒక్కరినీ కలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు నారా లోకేష్. ఆయన ప్రారంభించిన ప్రజా దర్బార్ కు సంబంధించి ఇది 14వ రోజు కావడం విశేషం. ఆయన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. తన శాఖతో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులకు ఫోన్లు చేస్తున్నారు.
దీంతో బాధితులు సంతోషానికి లోనవుతున్నారు. ఎన్నికల సందర్బంగా తాను ప్రజా దర్బార్ చేపడతానని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం కంటిన్యూ చేస్తూ ముందుకు సాగుతున్నారు నారా లోకేష్. గత ప్రభుత్వం ప్రజలను పట్టించు కోలేదని, తనను నమ్మి గెలిపించిన మంగళగిరి ప్రజలకు రుణపడి ఉన్నానని పేర్కొన్నారు .