కల్యాణ వేంకటేశ్వర స్వామి ఉత్సవాలు
జూలై 10 నుంచి 12వ తేదీ వరకు
తిరుపతి – శ్రీనివాస మంగాపురం లోనిశ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీవారి సాల కట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు జూలై 10 నుండి 12వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.
ఇందులో భాగంగా మూడు రోజుల పాటు ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
జూలై 10న పెద్ద శేష వాహనం, జూలై 11న హనుమంత వాహనం, జూలై 12న గరుడ వాహనంపై స్వామి వారు రాత్రి 7 నుండి 8 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాల మరుసటి రోజైన జూలై 13వ తేదీన పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీవారి మెట్టు సమీపంలోని మండపంలో ఉదయం 7 నుండి ఈ ఉత్సవం నిర్వహిస్తారు. కాగా
జూలై 10 నుండి 13వ తేదీ వరకు ఆర్జిత కల్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది.