NEWSNATIONAL

ఆర్మ్ స్ట్రాంగ్ కుటుంబానికి భ‌రోసా

Share it with your family & friends

ప‌రామ‌ర్శించిన సీఎం ఎంకే స్టాలిన్

త‌మిళ‌నాడు – బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ చీఫ్ ఆర్మ్ స్ట్రాంగ్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు సీఎం ఎంకే స్టాలిన్. పెరంపూర్ లోని ఆయ‌న నివాసానికి వెళ్లారు. చిత్ర ప‌టానికి పూల మాల‌లు వేసి నివాళులు అర్పించారు. అనంత‌రం ఆర్మ్ స్ట్రాంగ్ భార్య‌ను ఓదార్చారు. తాను ఉన్నానంటూ హామీ ఇచ్చారు. పోర్కోడితో పాటు కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు.

ఆర్మ్ స్ట్రాంగ్ పై హ‌త్యా య‌త్నానికి పాల్ప‌డిన వారిని క‌ఠినంగా శిక్షిస్తామ‌ని అన్నారు. ఎవ‌రైనా ఎంత‌టి వారైనా ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. హ‌త్యా నేరం ఎవ‌రు చేశారో, దానికి గ‌ల కార‌ణాల‌ను కూడా తాము ఆరా తీస్తున్నామ‌ని చెప్పారు ఎంకే స్టాలిన్.

ఇది అందరి ప్రభుత్వమ‌ని స్ప‌ష్టం చేశారు. అందరినీ ఆదరించి పేదల సంక్షేమాన్ని కాపాడే ప్రభుత్వమని పేర్కొన్నారు సీఎం. తప్పకుండా న్యాయాన్ని నిలబెడుతుందని హామీ ఇచ్చారు ఎంకే స్టాలిన్. పోలీసులు ఎలాంటి పక్షపాతం లేకుండా తమ విధిని నిర్వహిస్తారని చెప్పారు.