SPORTS

గంభీర్ కు జే షా కంగ్రాట్స్

Share it with your family & friends

టీమిండియా హెడ్ కోచ్ గా గంభీర్

ముంబై – భార‌త క్రికెట్ జ‌ట్టు హెడ్ కోచ్ గా రాహుల్ ద్ర‌విడ్ ప‌ద‌వీ కాలం ముగిసింది. దీంతో ఆయ‌న స్థానంలో భార‌త మాజీ క్రికెట‌ర్ , కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ హెడ్ కోచ్ , బీజేపీ మాజీ ఎంపీ గౌత‌మ్ గంభీర్ ను నియ‌మించింది బీసీసీఐ. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు జే షా.

అపార‌మైన అనుభ‌వం, ఓట‌మిని ఎన్న‌డూ ఒప్పుకోని మ‌న‌స్త‌త్వం క‌లిగిన గంభీర్ ను కోచ్ గా నియ‌మించ‌డం ప‌ట్ల సంతోషంగా ఉంద‌న్నారు. ఆయ‌న మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో టీమిండియా రాటు దేలుతుంద‌ని, మ‌రిన్ని విజ‌యాలు సాధిస్తుంద‌న్న నమ్మ‌కం త‌మ‌కు ఉంద‌ని స్ప‌ష్టం చేశారు జే. ఈ సంద‌ర్బంగా హెడ్ కోచ్ కు బీసీసీఐ త‌ర‌పున గ్రాండ్ వెల్ క‌మ్ చెబుతున్న‌ట్లు పేర్కొన్నారు.

ఇదిలా ఉండ‌గా త‌న‌ను హెడ్ కోచ్ గా నియ‌మిస్తే కొన్ని తాను చెప్పిన వాటికి ఓకే చెప్పాలంటూ బీసీసీఐకి కండీష‌న్స్ పెట్టిన‌ట్లు స‌మాచారం. గంభీర్ సూచించిన ప్ర‌తి దానికి బీసీసీఐ ఒప్పుకున్నందు వ‌ల్ల‌నే లైన్ క్లియ‌ర్ అయిన‌ట్టు టాక్. ఏది ఏమైనా గౌత‌మ్ మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ ప్లేయ‌ర్ గా పేరు పొందారు.